‘సర్’కు ఏర్పాట్లు పూర్తి
- ఈ నెల 25నుంచి ప్రారంభం
- ఓటర్లు, రాజకీయ పార్టీలు సహకరించాలి
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి) : తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ ఈనెల 25నుంచి జూలై 24వ తేదీ వరకు కొనసాగనుందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ బీఆర్‌కేఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫామ్స్ తీసుకోని వారికి ఫాం మరోమారు ఎన్యూమరేట్ ఫాం అందజేసే అవకాశం ఉందన్నారు.
జూలై 31న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల చేస్తామని, జూలై 31నుంచి ఆగస్టు 30వ తేదీ వర కు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు సహకరిం చా లని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 1న తుది జాబి తా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఆందోళన చెందవద్దు
సర్ ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమని, ఓటర్లను తొలగించడం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 24 ఏళ్లుగా ఓటరు జాబితా శుద్ధి జరగలేదన్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది మృతి చెంది ఉంటారని, కొందరు వలస వెళ్లి ఉంటారని తెలిపారు. వాటన్నింటినీ సరి చేయడమే సర్ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయ ప్రేరేపితం ఏమీ ఉండదని, ఆందోళన చెందవద్దన్నారు.
కులం, మతం తారతమ్యం లేకుండా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఎన్యూమరేషన్ ఫాం ఇస్తారని పేర్కొన్నారు. ఓటర్లు voters.eci.gov. టin వెబ్‌సైట్‌లో కూడా ఫామ్స్ సమర్పించవచ్చ ని చెప్పారు. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సత్యవాణి, ప్రభు త్వ అదనపు కార్యదర్శి శంకర్, సహాయ కా ర్యదర్శి ఏ.ఎస్.చారి, చెన్నయ్య పాల్గొన్నారు.






