11-02-2026 03:12:16 AM
హుజూర్ నగర్ ఫిబ్రవరి 10: ఓటర్లు ఎవ్వరి ప్రలోబాలకు లొంగ కుండా తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకొవా లని సూర్యపేట జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, హుజూర్ నగర్ ఆర్టీవో శ్రీనివాసులు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్,పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలలో ఐదు అంచలబందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు.హుజూర్ నగర్ మున్సిపాలిటీలో మొత్తం 56 పోలింగ్ స్టేషన్లు,18 లొకేషన్లు, 6 రూట్ లు,10 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నందున ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు.
పోలీస్ బందోబస్తులు వివరాలు.. ఒక అడిషనల్ ఎస్పి,ముగ్గురు సిఐలు, పదిమంది ఎస్ ఐలు, 15 ఏఎస్‌ఐలు,59 కానిస్టేబుల్ లు,23 మంది హోమ్ గార్డులు వీరికి తోడు మరో 10 మంది అదనపు సిబ్బందితో కలిపి 121 మంది పోలీసు సిబ్బంది పాల్గొననున్నారు.బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలో మొత్తం 28 వార్డులలో 29,99 6 ఓటర్లు వారిలో 14,257 పురుషులు, 15731 మహిళలు,8 ట్రాన్స్ జెండ్సర్స్ ఉన్నారు.నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 15 వార్డులలో 13,746 ఓటర్లు వారిలో 7,116 పురుషు లు,6,629 మహిళలు,ఒకరు ట్రాన్స్ జెండ్సర్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.