5 June, 2026 | 9:10 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

05-06-2026 07:31 PM

న్యాయమూర్తి సూరి రెడ్డి

మణుగూరు,(విజయక్రాంతి): ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, పచ్చదనాన్ని పెంపొందిస్తూ కాలుష్యాన్ని తగ్గించడంలో అందరూ భాగస్వాములు కావాలని మణుగూరు ప్రధమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి కంబపుసూరి రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలను నాటాలి, వాటిని సంరక్షించాలి. అప్పుడే పర్యావరణాన్ని కాపాడు కోగలం, భవిష్యత్తు తరాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించగలం. నేడు నాటే ప్రతి మొక్క, రేపటి తరాల ఆరోగ్యకరమైన జీవనానికి ఎంతగానో భరోసానిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు  న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.