21 July, 2026 | 8:09 AM

రైతులు ఆరుతడి పంటలు వేయాలి

20-07-2026 06:17 PM

చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని మల్యాల గ్రామంలో వానకాలం సాగుపై, అలాగే ఎల్ నినో ప్రభావం - రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. అలాగే చెరువులు పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి కనిపించడం లేదు. చివరి దశలో వర్షాలు వచ్చినా కూడా చెరువులు పూర్తిగా నిండే అవకాశం తక్కువగా ఉంది. అందువల్ల రైతులు మొత్తం విస్తీర్ణంలో వరి సాగు చేయకుండా, కొంత భాగంలో జొన్న, పెసలు, మినుములు, కంది, పొద్దుతిరుగుడు, ఆముదం, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో బోర్లు, చెరువుల ద్వారా నీటి లభ్యత మరింత తగ్గే అవకాశం ఉన్నందున, నీటిని ఆదా చేస్తూ ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను తగ్గించుకోవలన్నారు. రైతులందరూ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి సాగును కొంత మేర తగ్గించి, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపవలసిందిగా వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేశారు.