ఆనందాల వేళ సాంగ్ రిలీజ్
06-07-2026 02:38 AM
రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించారు. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు.
ఇప్పటి వరకు మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అందరినీ మెప్పించాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం మరో పాటను రిలీజ్ చేశారు. ‘ఆనందా ల వేళ’ అంటూ సాగే పాటను లవ్లీ హీరో ఆది విడుదల చేశారు. లిరికల్ వీడియోని వీక్షించి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ప్రామిసింగ్ ఉందని, టీంకి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ పాటకు చైతన్య ప్రసాద్ రాసిన సాహి త్యం, సాయి చరణ్ భాస్కరుణి, శృతిక సముద్రాల గాత్రం.. మణిశర్మ బాణీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి.






