కల్కి2లో ఆలియా!
ప్రభాస్ హీరోగా నాగ్‌అశ్విన్ కాంబోలో వచ్చిన భారీ ప్రాజెక్ట్ ‘కల్కి-’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండో భాగం ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా పలు కీలక సన్నివేశాలను కూడా పూర్తి చేశారు. అయితే, ఈ సినిమాలో కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.
ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఫిలిం ‘ఆల్ఫా’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ వీడియోను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. “ఆల్ఫా’ ట్రైలర్ అద్భుతంగా ఉంది” అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు. రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ఈ క్రేజీ పోస్టును ఆలియా వెంటనే తన సోషల్ మీడియాలో రీషేర్ చేస్తూ, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట ట్రెండ్ అవుతు న్నాయి.
ఆలియా సినిమా ట్రైలర్‌ను షేర్ చేయడం ద్వారా ఆమె ‘కల్కి-2’ సినిమాలో నటిస్తోందనే విష యాన్ని ప్రభాస్ పరోక్షంగా తెలియజేశా డంటూ నెటిజన్లు భావిస్తు న్నారు. ఫస్ట్ పార్ట్‌లో హీరోయిన్‌గా నటించిన దీపికా పదుకొణెను తొలగించి ఆలియాను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విష యమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






