2 May, 2026 | 4:42 PM

హైదరాబాదులో మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపిన ఆలపాటి

02-05-2026 03:23 PM

దమ్మపేట,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ శనివారం హైదరాబాదులో కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఓ ఈ ఆర్ 20.01 పర్సంటేజ్ ఆధారంగా ఆయిల్ ఫామ్ గెలల టన్ను ధర 23,501 నిర్ణయించడంతో ఆలపాటి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఆయిల్ ఫామ్ రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ  ఆయిల్ ఫెడ్ ఓ ఈ ఆర్ పర్సంటేజ్ ఆధారంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయిల్ ఫామ్ గెలల ధరను నిర్ణయించడంతో ఆంధ్రప్రదేశ్లో ఆయిల్  ఫామ్ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఓఈఆర్ 18 పర్సంటేజ్, తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఓ ఈ ఆర్ 20.01 ఉన్నది. ఈ నేపథ్యంలో  తెలంగాణ  ఓ ఈ ఆర్ పర్సంటేజ్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా గెలల టన్ను ధర పెరగటంతో ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్ సాగు రైతులు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఉభయ ఖమ్మం జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంచే విధంగా చేపడుతున్న చర్యలను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు ఆలపాటి వివరించారు. ఈ నెల ఆయిల్ ఫామ్ గెలల  టన్ను ధర 23 వేల 501 రూపాయి కావటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగు రైతులు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.