13 April, 2026 | 3:47 AM

బీ గ్రేడ్‌లో ఇంటర్ విద్యార్థి ఉత్తీర్ణత

13-04-2026 02:13 AM

పరీక్షల్లో తప్పుతానని ఆత్మహత్య చేసుకున్న అక్షాంత్

ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం

ఖమ్మం, ఏప్రిల్ 12(విజయక్రాంతి): పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.. అయితే ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో అద్భుతమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలు.. ఖమ్మం జిల్లా, బోనకల్ మండలంరాంపల్లి గ్రామానికి చెందిన గంగదేవుళ్ల అక్షాంత్ కొద్ది రోజుల క్రితం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశాడు.అయితే పరీక్షలు సరిగ్గా రాయలేదని.. తప్పుతానన్న భయంతో  ఆ విద్యార్థి గురువారం మధిర రైల్వే స్టేషన్ లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో ఆ కుటుంబంలో, ఆ గ్రామంలో విషాదం నెలకొంది. ఆదివారం విడుదలైన ఇంటర్మీడియ ట్ ఫలితాల్లో అక్షాంత్ బీ గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించాడు. ఫలితాలు రాకముందే ఆక్షాంత్ ఆత్మహత్య చేసుకోవడం, నేడు ఫలితాల్లో పాస్ కావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.