13 April, 2026 | 4:00 AM

వెక్టార్ విద్యార్థుల విజయకేతనం

13-04-2026 02:16 AM

నిజామాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని వెక్టార్ జానియర్ కళాశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు విరివిగా సాధించి విజయఢంకా మోగించారు.మొదటి సంవత్సరం ఎంపీసీ ఫలితాల్లో జొర్రీగల సాత్విక్ 468/470 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించగా, బుట్టు హేమశ్రీ 467/ 470 మార్కులు, జి.వీణ, సూర్యవంశి 466/ 470 మార్కులు, భానుశ్రీ, మణిరాజ్, రక్షిత, శర్వాణి ఈ నలుగురు 465/470 మార్కు లు సాధించారు.

ఇలా 43 మంది విద్యార్థులు 460కి పైగా మార్కులు సాధించారు. బైపీసీ మొదటి సంవత్సరంలో బండి శరత్ చంద్రిక 437/440 మార్కులలతో రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించారు.2 ఎంపీసీలో ఎస్. మనస్విని 991/1000 మార్కుల తో రాష్ట్ర స్థాయి-ర్యాంకు సాధించగా 989/ 1000 మార్కులతో జి. శ్రీనిధి 988/1000 మార్కులతో నలుగురు వంశి, యశ్వంత్, సమిత్ కుమార్, మోర శ్రీవాస్తవలు ప్రతిభ కనబర్చారని మధుసూధన్ జోషీ తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మధు సూధన్ జోషి డైరెక్టర్లు సంగం సంతోష్, గజానక్, కార్తిక్ విద్యార్థులను సన్మానించారు.