13 April, 2026 | 3:47 AM

ఇంటర్ ఫలితాల్లో శివాని విశ్వరూపం

13-04-2026 02:10 AM

సత్తా చాటిన కాలేజీ విద్యార్థులు

హన్మకొండ, ఏప్రిల్ 12(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో శివాని జూనియర్ కాలేజీ విద్యార్థులు మరోసారి విజయ దుందుబి మోగించారు. రెండో సంవత్సరం ఎంపీసీ విభాగంలో నేరెళ్ల రిషిత(2638201 884) 1000/995 మార్కులు సాధించారు. అలాగే లకుంట్ల చక్రిక(2638201809), అలకుంట్ల నవ్య(2638201510), బక్క సంధ్య(2638203833),కనకం రంజిత్ (2638209022) 1000/994 మార్కులు సాధించారు. అలాగే బైపీసీ విభాగంలో పొనుగోటి సహస్రశ్రీ(2638209022) 1000/99౫ మార్కులు సాధించారు.

ఎంపీసీ మొదటి సంవత్సరం విభాగంలో మేకల శ్రావ్య(2638117968)470/468, బీనవేణి అఖిలేష్‌యాదవ్(2638118150) 470/467, పక రక్షిత(2638117928), కేసరి రితిక(2638119189) 470/466 మార్కులు సాధించారు.బైపీసీలో తల్లపల్లి వర్షిత(2638104872)440/437, బుడ్డే వైష్ణవి (2638103635), మాలోత్ గాయత్రి (2638120388) 440/436 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో గుండేబోయిన అజయ్(2638119696) 500/485 మార్కులు సాధించారు.

గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఫలితాలను సాధిస్తూ నేడు ప్రకటించిన ఇంటర్మీడియేట్ ఫలితాలలో మరోసారి చరిత్రను తిరగరాస్తూ ఎంపీసీ, బైపీసీ విభాగాల నుంచి మంచి మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ టీ స్వామి, ప్రిన్సిపాల్స్ జీ సురేందర్‌రెడ్డి, వీ చంద్రమోహన్, డైరెక్టర్లు టీ రాజు, ఎన్ రమేష్, ఏ మురళీధర్, వీ సురేష్, ఎస్ సం తోష్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన కళాశాల అధ్యాప కులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు.