ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించిన మంచరామి సర్పంచ్
సుల్తానాబాద్ , మే 07 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచిరామి గ్రామం నుండి కరీంనగర్ కు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును గ్రామ సర్పంచ్ ఉప్పు లక్ష్మీ తిరుపతి మంచిరామి బస్ స్టాండ్ లో గురువారం ప్రారంభించారు. బస్సు రావడానికి కృషి చేసిన ప్రభుత్వ విప్ ,పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి , కరీంనగర్ , హుజురాబాద్ ఆర్టీసీ అధికారుల కు గ్రామస్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే దిశగా ఈ బస్సు సేవలు ఎంతో ఉపయోగపడతాయని సర్పంచ్ పేర్కొన్నారు. ఉప్పు లక్ష్మీ తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచిరామి నుండి కరీంనగర్ కు బస్సు సౌకర్యం కల్పించినందుకు ప్రజలు ఎంతో సంతోషిస్తూ సర్పంచ్ ఉప్పు లక్ష్మి తిరుపతి లకు కృతజ్ఞతలు తెలిపారు..






