17 April, 2026 | 3:06 PM

కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ

17-04-2026 01:26 PM

బిచ్కుందలో ఎక్సైజ్ సీఐ ఇంట్లో సోదాలు 

అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బిచ్కుందలో శుక్రవారం ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎక్సైజ్ సీఐ ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.

కామారెడ్డి జిల్లా బిచ్కుంద లోని ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ సోదాలు(Anti-Corruption Bureau ) నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహిస్తుండడంతో ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. వెంటనే ఎక్సైజ్ సీఐ(Excise CI)ని స్థానిక ఆసుపత్రికి తరలించారు, ఎక్సైజ్ సీఐ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.