9 May, 2026 | 3:36 AM

సీఎంఆర్‌ఎఫ్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

09-05-2026 01:10 AM

ఆమనగల్లు, మే 8 (విజయక్రాంతి): సీఎంఆర్‌ఎఫ్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఆరోపిస్తూ శుక్రవారం ఆమన గల్లు తహసిల్దార్ కార్యాలయంలో ఫహీం ఖాద్రీకి వినతి పత్రం అందజేశారు.

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ కు అందజేసిన సీఎంఆర్‌ఎఫ్ ఒరిజినల్ బిల్లులపై ఇప్పటివరకు చర్యలు లేవని బాధితులు ఆరోపించారు. 2018-2023 మధ్య జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ శుక్రవారం తప్పుడు పత్రాలతో చెక్కులు డ్రా చేసిన ఘటనలపై ఇప్పటికే ఆమనగల్లు కడ్తాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా తమకు న్యాయం చేయాలని బాధితులు  విజ్ఞప్తి చేస్తున్నారు.