9 May, 2026 | 4:31 AM

చెత్త బండిలో విద్యార్థులను తరలించిన అధికారులు

09-05-2026 01:10 AM

జనగామ, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇతర అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను మున్సిపల్ చెత్త బండిలో తరలించడం తీవ్ర విమర్శలు  దారితీసింది. జనగణన కార్యక్రమాల పై కలెక్టర్, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ చేపట్టారు. ర్యాలీ కోసం విద్యార్థులను తీసుకొచ్చారు ర్యాలీ ముగిసిన తర్వాత మున్సిపల్ చెత్త బండిలో విద్యార్థులను తరలించడం చూసిన తల్లిదండ్రులు చదువుకునే పిల్లలను ఇంత అవమానియంగా తీసుక వెళ్లాల్సిన అవసరం ఏంటని, ఇలా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.