18 July, 2026 | 12:35 PM

Breaking News

Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

ప్రజలను వంచించిన కాంగ్రెస్ ను నమ్మకండి

04-02-2026 04:11 PM

బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. ఈసారి మున్సిపాలిటీ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఖానాపూర్ మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని తపనతో ఉన్నది. ఈ మేరకు బుధవారం పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో టిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య ఝాన్సన్ నాయక్ తమ పార్టీ అభ్యర్థుల తరఫున ముమ్మరంగా ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసింది అనేది ప్రజలకు వివరించారు. రైతులను ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ పార్టీ నాయకులు ఓటు అడిగేందుకు వస్తే ఎక్కడికక్కడ నిలదీయాలని, ప్రభుత్వం ప్రజలకు బాకీ ఉన్న నగదును నిలదీసి రాబట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తమ పార్టీ అభ్యర్థి తోట సుమిత్ ను ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మాజీ మార్కెట్ చైర్మన్ సకారం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రవీందర్, మాజీ ఎంపీపీ వైస్ చైర్మన్ వాల్ సింగ్, అజయ్, తదితరులు ఉన్నారు.