calender_icon.png 4 February, 2026 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటం: నితిన్ నబిన్

04-02-2026 04:39:07 PM

హైదరాబాద్:  మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం(Vijay Sankalp Sammelan) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్(BJP National President Nitin Nabin), రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ... తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వీరుకులకు కాషాయ దళపతి నమస్కరించారు.

నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా ఈ గడ్డ నుంచి పోరాడారని ఆయన తెలిపారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) కృషిచేశారని గుర్తుచేశారు. కొన్ని వర్గాలను సంతృప్తపరచడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారని ఆయన ఆరోపించారు.  కాంగ్రెస్ పాలనలో(Congress rule) బలహీనవర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.

ఎస్టీ, ఎస్సీ సంక్షేమ పథకాల నిధుల్లో ప్రభుత్వం కోతపెడుతోందని వెల్లడించారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా నోరు మెదపట్లేదని నితిన్ నబీన్ మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆలయ భూములు ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులను సహించమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. రైతుభరోసా, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు.