ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా మాస శ్రీనివాస్ నియామకం
బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా సంత్ రవిదాస్ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా మాస శ్రీనివాస్ నియామకం.
చిట్యాల, జులై 17 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంత్ రవిదాస్ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా చిట్యాలకు చెందిన మాస శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కాంతి కిరణ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా ఇన్‌చార్జి, కొల్లూర్ పార్లమెంట్ సభ్యుడు మునిస్వామి చేతుల మీదుగా మాస శ్రీనివాస్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మాస శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కన్వీనర్‌గా నియమించిన బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కాంతి కిరణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ మాజీ ఎంపీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నకిరేకంటి మొగులయ్యలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, సంత్ రవిదాస్ జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.






