17 July, 2026 | 8:08 PM

Breaking News

రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •   మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ   •   భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు   •   మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు   •   ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం   •   అగర్వాల్ కంపెనీలో యాక్సిడెంట్.. వివరణ కోసం తూప్రాన్ సిఐకి వినతి   •   కోటి మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఓటే ప్రజాస్వామ్యానికి పునర్జీవం   •  

మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ

17-07-2026 07:58 PM

మునుగోడు,(విజయక్రాంతి): గుండాల పోలీస్ స్టేషన్లో బాధ్యతలు నిర్వహించి బదిలీపై మునుగోడు పోలీస్ స్టేషన్‌లో నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై)గా ఎం. శోభన్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. చట్టం అందరికీ సమానమని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

ప్రజలకు సత్వర న్యాయం అందేలా పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తామని, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజా భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజల సహకారంతో మునుగోడు ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.