16 July, 2026 | 2:04 AM

నకిరేకల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

16-07-2026 01:55 AM

పెండింగ్ కేసుల త్వరితగతిన పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశం

చిట్యాల, (నకిరేకల్) జూలై 15 : నల్గొండ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ బుధవారం నకిరేకల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా స్టేషన్లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పోలీసుల పనితీరును క్షుణ్ణంగా సమీక్షించారు. తనిఖీల సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, పెండింగ్ కేసుల స్థితి, సిబ్బంది హాజరు, స్టేషన్ ఆవరణ నిర్వహణ, రాత్రి వేళల్లో భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ నకిరేకల్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు పలు కీలక సూచనలు చేశారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, బెయ్పి విడుదలైన నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను మరింత పటిష్టం చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న సైబర్ నేరాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను సున్నితంగా స్వీకరించి చట్టపరమైన చర్యలను వేగంగా చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా ప్రతి పోలీసు అధికారి నిబద్ధతతో పనిచేయాలని, క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ తనిఖీల్లో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నకిరేకల్ సీఐ, ఎస్‌ఐతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.