17 July, 2026 | 12:40 AM

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందిస్తున్నాం

17-07-2026 12:24 AM

కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం 

చిట్యాల, జూలై 16: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తున్నామని గురువారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. నార్కెట్పల్లి మండలానికి చెందిన 102 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు.

సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న ఆయన, నకిరేకల్ నియోజకవర్గంలో రహదారులు, విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని చెప్పారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యే వేముల వీరేశంకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.