16 August, 2026 | 6:49 PM

శబరిమాత పాదపూజ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

16-08-2026 05:38 PM

బోథ్. ఆగస్టు 16 (విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలో నిర్వహించిన అఖండజ్యోతి దర్శనానికి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బలి రామ్ జాదవ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆశ్రమాలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రమ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. గ్రామ సర్పంచ్ ఆకుల అనిత రాజేందర్ తో పాటు పలువురు పాల్గొని సన్మానించడం జరిగింది.