అహంకారం వల్ల మనిషి నష్టపోతాడు. ప్రేమతో ఏదైనా జయించవచ్చు.
బోథ్. ఆగస్టు 16 (విజయక్రాంతి): అహంకారం వల్ల మనిషి నష్టపోతాడే కాని ఏది కూడా సాధించలేడని రాజ్యశ్యామల పీఠాధిపతి కృష్ణ యోగానంద స్వామి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కనుగుట్ట గ్రామంలో నిర్వహించిన అఖండ జ్యోతి కార్యక్రమానికి హాజరై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చని అహంకారంతో అనగదొక్కబడతారన్నారు. సాటి జీవి పట్ల ప్రేమ అనురాగాలు పంచినప్పుడే మనం భగవంతుని మార్గంలో వెళ్తా మన్నారు.
మట్టిలో కలిసి ఈ దేహం పైన అధిక మోహన్ ఉండవద్దని మోహన్ ఉంటే దైవ మార్గం లభించదన్నారు. పని చేస్తూనే భగవాన్ నామ స్మరణ చేయాలని సద్గురు శ్రీ శబరి మాతాజీ వారు చెప్పడం జరిగిందన్నారు. మనిషిని సన్మార్గంలో పెట్టేందుకు అఖండ జ్యోతి కార్యక్రమాన్ని శబరిమాత ప్రారంభించిందని దానిని భక్త బృందం ఇప్పటికీ ఆచరించడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో శ్రీకాంత్ భజన బృందం వారు భక్తి గీతాలు ఆలపించగా జిల్లాలోని నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆదివారం రోజున కౌట(బి )గ్రామానికి చెందిన భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామీజీని గ్రామ సర్పంచ్ ఆకుల అనిత రాజేందర్ తో పాటు ఆలయం కమిటీ వారు సన్మానించారు.






