15 August, 2026 | 5:58 PM

బేలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

15-08-2026 03:24 PM

బేల, (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శని వారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేష్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.