వాజ్ పేయ్ నీ ఆదర్శంగా తీసుకోవాలి
16-08-2026 05:21 PM
బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు
కామారెడ్డి, ఆగస్టు 16 (విజయక్రాంతి): మాజీ ప్రధాని వాజ్పేయి నీ ప్రతి రాజకీయ నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజు లు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బిజెపి కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్ పేయ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు అటల్ బిహారీ వాజ్పేయి అని అన్నారు. అనంతరం వాజ్పేయికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మోహన్ రెడ్డి, విపుల్ జైన్, నరేందర్ రెడ్డి, కాసార్ల రవీందర్, కుంట లక్ష్మారెడ్డి, ఆకుల భరత్, తదితరులు పాల్గొన్నారు.






