కుల గణన చేపట్టడం హర్షనీయం
నిర్మల్,ఆగస్టు 16 (విజయక్రాంతి): భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కుల గణన చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం బీసీ సంక్షేమ సంఘం పోరాటమే కారణమని జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరులో ఇటీవల జరిగిన 11వ జాతీయ ఓబీసీ మహాసభలో దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేసినట్టు ఆయన వివరించారు.
జనాభాలో బీసీల వాస్తవ జనాభా ఎంత? వారికి విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో ఎంత ప్రాతినిధ్యం ఉంది? అనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవడానికి కులగణన ఎంతో అవసరమని మహాసభలో ప్రతినిధులు స్పష్టం ప్రతినిధులు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం Census 2027లో కుల వివరాలను నమోదు చేసే ప్రక్రియను అధికారికంగా ముందుకు తీసుకెళ్లడం బీసీ ఉద్యమానికి ఒక ముఖ్యమైన విజయం అనిపేర్కొన్నారు. ప్రక్రియ పూర్తి అయితే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం.






