16 August, 2026 | 11:17 AM

ప్రజావాణి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

16-08-2026 10:09 AM

బోథ్,ఆగస్టు16(విజయకాంతి): ఈనెల 17న మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో 23 మండల శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంటుందన్నారు. మండల నోడల్ అధికారిగా ఎంపీడీవోలు వ్యవహరిస్తారు. కార్యక్రమంలో మండల స్థాయి లో పరిష్కారమయ్యే సమస్యలను ప్రజావాణిలో పరిష్కరించటం జరుగుతుందని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.