9 July, 2026 | 2:04 AM

అల్మాస్‌గూడలో ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు

09-07-2026 12:15 AM

బడంగ్‌పేట్, జులై 8: విజయక్రాంతి: దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను బడంగ్ పేట్ సర్కిల్ 57వ డి8విజన్ అల్మాస్గూడలోని వైఎస్‌అర్ పార్క్ దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైఎస్‌ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దివంగత నేత  వైఎస్‌ఆర్ రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు సహా ప్రతి వర్గం ప్రజల సంక్షేమం కోసం అనేక చారిత్రాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప నేత అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశేష సేవలు అందించిన మహానేత అని అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేక 16 సంవత్సరాలు గడిచినా, ఇప్పటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అన్నారు.

అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రగతి కోసం విశేష కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమములో మాజీ జడ్పీటీసీ బండారు సత్యనారాయణ, బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, నవారు మల్లారెడ్డి, ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, బోయపల్లి వెంకట రెడ్డి, దిండు శ్రీనివాస్ గౌడ్, వినోద్ నాయక్తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, వైఎస్‌ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా నివాళులు

నాగోల్, జూలై 8 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కొత్తపేట చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జావిద్ యువజన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో-కన్వీనర్ వజీర్ ప్రకాష్ గౌడ్, కొత్తపేట డివిజన్ పార్టీ అధ్యక్షుడు లింగాల కిషోర్, చైతన్యపురి డివిజన్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మద్దుల వెంకటేశ్వర్ యాదవ్, కరీం, దాము మహేందర్, మహిళా నాయకురాలు రజిని, కొమ్ము యాదగిరి, తావుల బాబు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.