8 June, 2026 | 4:53 AM

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

08-06-2026 01:09 AM

బోధన్, జున్ 7 (విజయ క్రాంతి): నవీపేట్ మండలం కోస్లీలో ఆదివారం ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మోహన్ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పరిశీలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.