29 July, 2026 | 2:33 AM

సాంకేతిక పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం

29-07-2026 01:37 AM
  1. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి 
  2. స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులకు అభినందనలు

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈ ఓ) పవన్ కుమార్ చందన, సహ వ్యవస్థాపకుడు, ముఖ్య నిర్వహణ అధికారి (సీఓఓ) నాగభరత్ ఢాకా ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారతదేశంలోనే ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయో గ వాహనం విక్రమ్ విజయవంతంగా ప్రయోగించిన తీరును సీఎంకు వివరించా రు.

ఈ విజయంతో అమెరికా, చైనా తర్వాత మూడో దేశంగా భారత్ నిలిచిందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల పురోగతి, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ప్రభుత్వం-ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.