చేనేత వస్త్రాల కొనుగోలులో టెండర్ విధానం రద్దు చేయాలి
వరంగల్, జూన్ 7 (విజయక్రాంతి): చేనేత వస్త్రాల కొనుగోలులో ఓపెన్ టెండర్ విధానం, ఓపెన్ మార్కెట్ విధానం రద్దుచేసి పాత పద్ధతి జీవో నెంబర్1 టెస్కో ద్వారా చేనేత సహకార సంఘాల నుండి ఆర్డర్ల ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థలకి, పాఠశాలలకి, హాస్టల్స్ కి, గురుకులాలకి, సొసైటీలకి చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునారి శేషు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసినారు.
చేనేత కార్మికులను, పవర్ లూమ్ కార్మికులను ఆదుకోటానికి 2024లో ప్రభుత్వం జీవో నెంబర్ .1.ని జారీ చేసి చేనే త రంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారా కాకుండా ఓపెన్ టెండర్ విధానం ద్వారా కొనాలని విద్యాశాఖ భావించటం వలన దరిదాపు 50 వేల మంది చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి చేనేత వస్త్రాల కొనుగోలు విషయంలో పాత పద్ధతినే కొనసాగించాలన్నారు.
చేనేత వస్త్రాల కొనుగోలు విషయంలో పాత పద్ధతినే కొనసాగించకుండా ఓపెన్ టెండర్ విధానాన్ని అవలంబిస్తే చేనేత రంగంలో కార్మికుల ఆత్మహత్యలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి విద్యాశాఖ మంత్రిగా కూడా మీరే వ్యవహరిస్తున్నారు కాబట్టి విద్యాశాఖ నిర్ణయాన్ని పునః పరిశీలన చేయవలసినదిగా చేనేత కార్మికుల పక్షాన బీసీ జాక్ మీకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.






