ఆస్తి కోసం అక్కను చంపిన తమ్ముడు!
కత్తితో పొడిచి హత్య
సూర్యాపేట, మే 18 (విజయక్రాంతి): ఆస్తి కోసం అక్కను తమ్ముడు కత్తితో పొడిచి చంపిన ఘటన సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు(ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన సురుగు అంజమ్మ(50) భర్త చనిపోయాడు. పిల్లలు లేకపోవడంతో అ మ్మగారి ఊరైన తుమ్మల పెనపహాడ్‌లోని తన చెల్లెలు వద్ద ఉంటున్నది.
అయితే తన పేరు మీద ఉన్న రెండు ఎకరాల భూమిని చె ల్లెలికి ఇస్తానని అనడంతో ఆమె తమ్ముడు సైదులు వ్యతిరేకిస్తూ.. అక్కతో గొడవలు పెట్టుకుంటున్నాడు. కోపం పెంచుకున్న సైదులు అక్కను చంపితేనే తనకు ఆస్తి వ స్తుందని హత్యకు ప్లాన్ చేశాడు. సోమవారం ఉదయం అంజమ్మ ఉపాధి పనికి వెళ్తుండగా వెనక నుంచి వెళ్లి ఒక్కసారిగా కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.






