ఓటర్ల మ్యాపింగ్ వేగంగా పూర్తి చేయాలి
19-05-2026 12:44 AM
ఆమనగల్లు, మే 18 (విజయక్రాంతి): ఓటర్ల మ్యాపింగ్ వేగంగా పూర్తి చేయాలని ఆమనగల్లు తహసిల్దార్ మహమ్మద్ ఫహీం ఖాద్రీ అన్నారు.ఎస్‌ఐ ఆర్ 2002 జాబితా 2025 ఓటర్ల జాబితా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలను వేగవంతం పూర్తి చేయాలని సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం తహసిల్దార్ ఆమనగ ల్లు మండలంలోని మేడిగడ్డ గ్రామపంచాయతీని సందర్శించారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ప్రింట్ తీసుకుని సంబంధిత పోలింగ్ బూత్లకు పంపిణీ చేయాలన్నారు. ప్రతి ఇంటికి రెండు ఫారాల చొప్పున బిఎల్‌ఓ దగ్గర అందుబాటులో పెట్టాలని సూచించారు. బిఎల్‌ఓ సూపర్వైజర్లతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచి విజయ్ రాథోడ్, మల్లేష్,ఆర్ ఐ సంపత్, బిఎల్ వో సరోజ, హరిలాల్, పాండు తదితరులు పాల్గొన్నారు.






