19 May, 2026 | 3:02 AM

ప్రధాని మోదీ సందేశంతో ప్రజల్లోకి..

19-05-2026 12:47 AM

అవగాహన కల్పిస్తున్న బీజేపీ నేత పెరికె సురేష్

నగరంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పర్యటించిన సురేష్

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన, ఇంధన పొదుపు, బాధ్యతాయుత వనరుల వినియోగ పిలుపునకు మ ద్దతుగా బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడి యా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రయాణిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ఈ సందర్భంగా పెరిక సురేష్ నగరంలోని పలు ప్రాంతాల్లో నుంచి మార్కెట్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై పర్యటించారు. నారాయణగూడ చౌరస్తాలో వేస వి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లను అందించారు. ప్రజా బాధ్యత, క్రమశిక్షణతో కూడిన నాయకత్వానికి ఆయ న ఆదర్శంగా నిలిచారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. కారులో ప్రయాణించకుండా ప్రజా రవాణా, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా ఇంధన పొదుపు, ఆర్థిక ఆదా, స్థిరమైన రవాణా విధానాల పట్ల తన నిబద్ధతను చాటిచెప్పారని తెలిపారు.

దేశ ప్రజలు అనవసర ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, బాధ్యతాయుత జీవన విధానాలను అలవర్చుకోవాలని ప్రధానమంత్రి న రేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పెరిక సురేష్ వెల్లడించారు. ప్రధాని మోదీ సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాలనే ఉద్దేశంతో తాను ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఉపయోగిస్తూ వీధులు, కూడళ్లు, మార్కెట్లలో ప్రజ లకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.