28 July, 2026 | 7:08 PM

హనుమాన్ ఆలయానికి చేయూత

28-07-2026 06:31 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న శ్రీ హనుమాన్ ఆలయ అభివృద్ధికి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కిర్మిల వినోద్ చారి మంగళవారం చేయూతనందించారు. ఆలయ నిర్మాణ పనులకు తన వంతు సహాయంగా రూ.5 వేల నగదు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ నిర్మాణం త్వరగా పూర్తై భక్తులకు సేవలందించాలని ఆకాంక్షించిన ఆయన, సమాజంలో ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. కిర్మిల వినోద్ అందించిన ఆర్థిక సహాయానికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.