15 June, 2026 | 10:24 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ప్రేమ, పెళ్లి పేరుతో యువతికి మోసం

06-04-2026 12:47 AM

సికింద్రాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కూకట్ పల్లి పరిధిలో ఒక విస్తుపోయే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ,పెళ్లి పేరుతో ఒక యువతిని నమ్మించి, అత్యంత దారుణంగా సామూహిక లైంగికదాడికి పాల్పడటమే కాకుండా, బలవంతంగా మత మార్పిడి చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిపై పోలీసులను ఆశ్రయించింది.

ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నవాజ్ అనే వ్యక్తి సదరు హిందూ యువతిని ప్రేమ పేరుతో నమ్మించాడు. వివాహానికి ముందే జూలై 2025లో నవాజ్ ఆమెను బేగంపేటలోని తన గదికి పిలిపించాడు. అక్కడ ఆమెకు నీటిలో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత నవాజ్ తన సోదరులు, స్నే హితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి (గ్యాంగ్ రేప్) బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత నిందితుడు ఆమెను వివాహం చేసుకున్నాడు.

అయితే పెళ్లి జరిగిన తర్వాత అసలు స్వరూపం బయటపడింది. నవాజ్ తనను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాడని బాధితురాలు ఆరోపించింది. అంతే కాకుండా తనకు తెలియకుండానే నవాజ్ అప్పటికే మరో ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడని, తనను మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడి వేధింపులు భరించలేక చివరకు పోలీ సులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీ సులు షేక్ నవాజ్, షేక్ మునావర్, ఇస్మాయిల్, షారుక్, ఇర్ఫాన్ అనే ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అయితే ప్రధాన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో కూకట్ పల్లి పోలీసులు ప్రాథమికం గా జీరో ఎఫ్‌ఎఆర్ నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును బేగంపేట పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు.