15 June, 2026 | 11:28 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

అక్రమాలపై విచారణ జరిపించాలి

06-04-2026 12:45 AM

కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ సవాల్

బడంగ్‌పేట్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి) బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ నాయకుడు కేఎల్‌ఆర్ (కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి)కి చిత్తశుద్ధి ఉంటే, వెంటనే జ్యుడీషియల్ విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బడం గ్పేట్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు కాంగ్రెస్, బీజేపీ తీరును ఎండగట్టారు.

బడంగ్పేట్ కార్పొరేషన్ లో  కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే అవినీతి జరిగిందని, అందుకే పది మంది అధికారులు సస్పెండ్ అయ్యారని ఆరోపించారు. బదిలీపై వెళ్లిన కమిషనర్ను తిరిగి ఎవరు తెప్పించారో సమాధానం చెప్పాలని నిలదీశారు. కేవలం అధికారులపై వేటు వేసి చేతులు దులుపుకోకుండా, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి పక్కా విచారణ జరిపించాలని సూచించారు.

అవినీతిపై విచారణకు తాము సిద్ధమని, దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు విచారణకు పట్టుబట్టాలని బీఆర్‌ఎస్ నేతలు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సూర్ణగంటి అర్జున్, పవన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.