15 June, 2026 | 10:34 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి

15-06-2026 09:29 PM

కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి బలోపేతానికి నిదర్శనం: డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలవటానికి కృషి చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు.ఆయన సోమవారం నాడు నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో బీ ఎల్ ఏ, సర్ మ్యాపింగ్ కార్యక్రమం 90 శాతం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో మిగిలిన పనులను కూడా వేగవంతంగా పూర్తి చేసి, ప్రతి బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.