చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఏజెన్సీలోని పలు మండలాల ప్రజలకు వైద్య సేవలు అందించే ఇంద్రవెల్లి పీఎస్సీలో చిన్నారి పిల్లల రక్షణకే బేబీ కేర్ రూమ్ తో పాటు ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. సోమవారం సాయంకాలం ఇంద్రవెల్లి పర్వత మీకు ఆరోగ్య కేంద్రంలో బేబీ కేర్ రూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతంలోని గర్భిణీలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి సుఖ ప్రసవాలు అయ్యేవిధంగా వైద్య సిబ్బంది సహకరించాలన్నారు.
ఇంద్రవెల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, సిరికొండ, అదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజలు వైద్యం కోసం వస్తుంటారని అన్నారు. వర్షాకాలంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి అంటు వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. ఆయనతోపాటు బిజెపి నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






