15 June, 2026 | 10:53 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్

15-06-2026 09:41 PM

చివ్వెంల,(విజయక్రాంతి): కుడకుడ పరిధిలో చివ్వెంల పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 250 గ్రాముల గంజాయితో ఓ యువకుడు పట్టుబడ్డాడు. ఈ రోజు ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని ఆపి తనిఖీ చేయగా, అతని వద్ద నిషేధిత గంజాయి లభ్యమైంది. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అతను కుడకుడ గ్రామానికి చెందిన జక్కలి వినయ్ అలియాస్ వినయ్ గౌతమ్ (22)గా గుర్తించారు. అతని వద్ద ఉన్న 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట రూరల్ సీఐ జి. రాజశేఖర్ తెలిపారు. జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసినా, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని సీఐ తెలిపారు.