నిప్పులు చెరిగిన నబీ
- భారత్ ఏ జట్టుకు ఆధిక్యం
- లంక ఏతో అనధికారిక టెస్ట్
గాలె, జూన్ 27 : శ్రీలంక- ఏ తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు పైచేయి సాధించింది. భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఏ 330 పరుగులకు ఆలౌటైంది. పేసర్ అకిబ్ నబీ నిప్పులు చెరిగే బంతులతో లంకను దెబ్బకొట్టాడు. మిగతా పేసర్లు యశ్ ఠాకూ ర్, కూడా సత్తా చాటారు. నబీ నాలుగు వికెట్లతో లంక ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. స్పి న్నర్లు హర్ష్ దూబే 2, సరాన్ష్ జైన్ 1 వికెట్ పడగొట్టారు.
లంక ఇన్నింగ్స్‌లో నువనిదు ఫెర్నాండో (84), అషేన్ బండార (70), కెప్టెన్ సహాన్ అరాచ్చిగే (72) అర్ధ సెంచరీలతో రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సాయి సుదర్శన్, కెప్టెన్ ధృవ్ జురెల్ సెంచరీలతో 6 వికెట్ల నష్టానికి 452 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
మిగతా బ్యాటర్లలో షేక్ రషీద్ అర్ధ సెంచరీతో రాణించాడు. లంక బౌలర్లలో గుణశే ఖర 3, సుధీర 2, రవిందు ఓ వికెట్ తీశారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (7) రిటైర్డ్ హర్ట్ కాగా.. ఆయుశ్ పాండే, దేవ్‌దత్ పడిక్కల్ తలో 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 122 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకొని, 170 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.






