2 May, 2026 | 1:51 PM

వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా

02-05-2026 12:54 PM

హైదరాబాద్: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు నోష్ ల్యాబ్(Veliminedu NOSCH Lab) వద్ద కార్మికులు ధర్నాకు దిగారు. నిన్న నోష్ ల్యాబ్ లో ప్రమాదాన్ని నిరసిస్తూ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(MLC Nellikanti Satyam), సీపీఐ నేతలు కార్మికులకు మద్దతు తెలిపారు. ల్యాబ్ ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. మృతుడు బాలకృష్ణ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం ఇవ్వాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన నోష్ ల్యాబ్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిట్యాల మండలం, వెలిమినేడులోని ఒక ప్రయోగశాలలో శుక్రవారం జరిగిన రియాక్టర్ పేలుడులో తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.