దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో మహిళా దినోత్సవం
మహిళా కానిస్టేబుల్‌లకు సన్మానం
కామారెడ్డి, మార్చి 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్త్స్ర నరేష్ ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్ లను సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర నరేష్ మాట్లాడుతూ మహిళ పోలీసులు ఒకవైపు విధులు నిర్వహిస్తూ మరోవైపు ఇంటి పనులను చూసుకుంటూ సమాజంలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

రామేశ్వర్పల్లిలో
భిక్కనూర్, మార్చి 9 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం రామేశ్వర్పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, విడిసి అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ వినోద్ గౌడ్ పాల్గొన్నారు.
అలాగే వార్డు సభ్యులు మద్ది కృష్ణారెడ్డి, పనాస రాజు, లావణ్య, సులోచన, భవాని, పంచాయతీ సెక్రటరీ శ్యామ్, ఐకెపి సీసీ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయురాళ్లు, ఇందిరమ్మ కమిటీ మహిళా సభ్యులు, ఐకెపి అధ్యక్షులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఐకెపి సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.




