సర్వ జ్ఞలో మహిళా దినోత్సవం
10-03-2026 01:22 AM
ఖమ్మం, మార్చి 8 (విజయక్రాంతి): ఖమ్మం వీవీఓస్ కాలనీలోని సర్వజ్ఞ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజ నిర్మాణం లో మహిళల పాత్ర ఎంతో గొప్పదని తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ నీలిమ మాట్లాడు తూ మహిళల సాధికారత, సమాన హక్కు లు, చరిత్రలో, ఆధునిక సమాజంలో స్త్రీలు సాధించిన విజయాలను గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించి వారికి సమానావకాశాలు కల్పించాలన్నారు.




