లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి
శేరిలింగంపల్లి,ఆగస్టు 4 (విజయక్రాంతి):చందానగర్లోని ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమా దం జరిగి ఒక మహిళ ప్రాణా లు కోల్పోయింది. మరమ్మత్తు పనులు జరుగుతున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసు కోకపోవడమే ఈ విషాదానికి కారణమని బాధిత కుటుంబం ఆరోపిస్తోం ది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో చందానగర్లోని అన్నపూర్ణ ఎన్క్లేవ్, చాట్వాజ్ మెన్షన్ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ధాడి శ్రీనివాస్ (46), అతని భార్య అనసూయ (43) తమ మేనమామను పరామర్శించడానికి అపార్ట్మెంట్కు వెళ్లారు. గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కుతున్న సమయంలో అనసూయ ఒక కాలు లోపల పెట్టి మరో కాలును లోపలికి తీసుకురాబోతుండగా లిఫ్ట్ అకస్మాత్తుగా పైకి కదిలింది.
దీంతో ఆమె లిఫ్ట్, ద్వారం మధ్య ఇరుక్కుపోయి తీవ్ర గా యాలతో కుప్పకూలింది. చుట్టుపక్కల వారు సాయంతో ఆమె ను బయటకు తీసి అర్చనా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిన ట్లు నిర్ధారించారు. బాధితుడు ధాడి శ్రీనివాస్ చందానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.లిఫ్ట్ మరమ్మత్తు పనులు జరుగుతున్నప్పుడు టెక్నీ షియన్ అనిల్ కుమార్ విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా పనులు చేశారని ఆరోపించారు. పోలీసులు ఫిర్యాదు అందుకుని విచారణ ప్రారంభించారు.






