5 August, 2026 | 2:43 AM

వయోపరిమితి పెంపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

05-08-2026 12:54 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, ఆగస్టు 4 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో నిరుద్యోగులకు వయోపరిమితి సడలింపు కల్పించాలని కోరుతూ మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు పోలీస్ ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా పలువురు నిరుద్యో గులు తమ సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు. నిరుద్యోగుల విన్నపంపై సాను కూలంగా స్పందించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ... వయోపరిమితి పెంపు విషయాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయమైన పరిష్కారం లభించేలా తన వంతు కృషి చేస్తానని నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారు. అనంతరం నియోజకవర్గం లోని పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన చెక్కుల ను పంపిణీ చేశారు.