ప్రతి గింజకూ లెక్క
- డిఫాల్ట్ మిల్లర్లపై ఉక్కుపాదం
- ప్రతి రూపాయి, ప్రతి గింజను వసూలు చేస్తాం
- దశాబ్ద కాలం సీఎంఆర్ వ్యవస్థపై సమగ్ర ఆడిట్
- మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి) : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవస్థపై గత పది నుంచి పన్నెండు సంవత్సరాల కార్యకలాపాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం సేకరణ నుంచి బియ్యం అప్పగింత వరకు జరిగిన ప్రతి లావాదేవీ, మిల్లర్ల వారీగా డిఫాల్ట్లు, పెండింగ్ బకాయిలు, రికవరీలు, విజిలెన్స్ దర్యాప్తులు, న్యాయపరమైన చర్యలు, అమలు వ్యవస్థలను క్షుణ్ణంగా సమీక్షించి, భవిష్యత్తులో ఇలాంటి లోపాలకు తావులేకుండా సమ గ్ర సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం పౌరసరఫరాల శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దశాబ్దకాలంగా జరిగిన ధాన్యం సేకరణ, సీఎం ఆర్ బకాయిలు, ఎఫ్‌సీఐకి అప్పగించిన బియ్యం, జిల్లాల వారీగా, మిల్లర్ల వారీగా పెండింగ్ డిఫాల్ట్, రికవరీల పురోగతి, విజిలెన్స్ కేసులు, న్యాయపరమైన చర్యలను విస్తృతంగా సమీక్షించారు.
ఈ సందర్భం గా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడు తూ, తప్పుడు విధానాలను అవలంబించిన వారికి శిక్షలు విధించడం మాత్రమే కాదు.. ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసి న ప్రభుత్వ ధాన్యాన్ని, ప్రభుత్వానికి రావలసిన ప్రతి రూపాయిని పూర్తిగా తిరిగి రాబట్టడమేనని ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కింద కొనుగోలు చేసే ప్రతి ధాన్యం గింజ వెను క తెలంగాణ రైతు చెమటతో పాటు ప్రజ ల సొమ్ము ఉందన్నారు. సివిల్ సప్లయ్ శాఖ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధా న్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం ఎంపిక చేసిన రైస్ మిల్లర్లకు అప్పగిస్తుందని, వా రు ఒప్పందం ప్రకారం నిర్దేశిత పరిమా ణం, నాణ్యతతో బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సిన బాధ్యత కలిగి ఉంటారని మంత్రి గుర్తు చేశారు.
టన్ను బియ్యం తగ్గినా..
మిల్లర్‌కు అప్పగించే ప్రతి బస్తా ధాన్యం ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ప్రభుత్వ ఆస్తి అని, అందులో ఒక్క గింజ దారి మళ్లినా అది తెలంగాణ ప్రజలకు నష్టమన్నారు. ప్రభుత్వానికి రావలసి న ఒక్క టన్ను బియ్యం తగ్గినా ప్రజా పంపిణీ వ్యవస్థ బలహీనపడుతుందని మంత్రి ఘాటుగా హెచ్చరించారు. పెం డింగ్ బకాయిల్లో ఎక్కువ భాగం గత ప్రభుత్వాల కాలంలో పేరుకుపోయినవేనని, ప్రస్తు తం వాటి రికవరీకే అత్యంత ప్రాధాన్యం ఇ స్తున్నామని తెలిపారు.
నగదు రూపంలో చెల్లింపులు, ధాన్యం తిరిగి అప్పగింత, నాణ్యమైన బియ్యం సరఫరా వంటి అన్ని మార్గాల ద్వారా గరిష్ఠ స్థాయిలో రికవరీలు సాధించే చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. డిఫాల్ట్ మిల్లర్లకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన పరిమిత గడువు కారణంగా ఇప్పటికే గణనీయమైన రికవరీలు జరిగాయని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రతి కేసుపై మిల్లర్ వారీ గా గడువు నిర్ధారించి ప్రత్యేక రికవరీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు.
సమూల సంస్కరణలు..
సీఎంఆర్ విధానంలో మార్పులు తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. ఒప్పంద నిబంధనలను మరింత కఠినతరం చేయడం, బ్యాంకు గ్యారంటీలను బలోపేతం చేయడం, డిఫాల్టర్లపై కఠిన చర్యలు తీసుకునే అంశాలను కొత్త విధానంలో చేర్చాలని నిర్ణయించి నట్లు చెప్పారు. పెండింగ్ రికవరీలు, ఆస్తుల జప్తు, బ్యాంకు గ్యారంటీల అమలు, సివిల్, క్రిమినల్ కేసుల పురోగతితో పాటు రికవరీలకు అడ్డంకిగా ఉన్న ప్రతి పరిపాలనా అవ రోధాన్ని వెంటనే తొలగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
భవిష్యత్తులో ఒక్క గింజ కూడా దారి మళ్లకుండా సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను ప్రవే శపెట్టాలన్నారు. దీనిలో క్యూఆర్ కోడ్‌తో గన్నీ సంచులు, జీపీఎస్ ఆధారిత వాహన ట్రాకింగ్, జియో ట్యాగ్ తనిఖీలు, రియల్ టైమ్ స్టాక్ రీకన్సిలియేషన్, ప్రొక్యూర్మెంట్-మిల్లింగ్-ఎఫ్సీఐ డేటాబేస్ల అనుసంధానం, ఎర్లీ వార్నింగ్ వ్యవస్థ, రిస్క్ ఆధారిత మిల్లుల ఆడిట్లు వంటి ఆధునిక వ్యవస్థలను ప్రవేశపెట్టాలని మంత్రి సూచించారు.
నిజాయితీ మిల్లర్లకు పూర్తి భరోసా..
డిఫాల్ట్ కారణంగా రైతులు ఏ విధంగానూ ఇబ్బంది పడరని మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి తెలిపారు. కనీస మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు, రైతుల ఖాతాల్లో నేరుగా సకాలంలో చెల్లింపులు, సేకరణ ప్రక్రి య యథావిధిగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు. నిజాయితీగా పనిచేస్తున్న రైస్ మిల్లర్లకు భయపడాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.
అయితే ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించే వారు, ఒప్పందాలను ఉల్లంఘించే వారు మాత్రం ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి హెచ్చరించారు. ప్రజల ఆస్తిని కాపాడటంలో, ప్రభుత్వ బకాయిలను పూర్తిగా రాబట్టటంలో, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయటంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్, ప్రొక్యూర్మెంట్, ఫైనాన్స్, లాజిస్టిక్స్, లీగల్, మార్కెటింగ్ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విజిలెన్స్ దాడులు కొనసాగుతాయి
రాష్ట్రంలోని అత్యధిక మంది రైస్ మి ల్లర్లు నిజాయితీగా ప్రభుత్వంతో కలిసి పనిచేశారని, అయితే కొద్దిమంది మాత్ర మే బియ్యం అప్పగింతలో జాప్యం చేయ డం, ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించ డం, ఒప్పందాలను ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడ్డారని మంత్రి తెలిపారు. అన్నారు. ఈ సమావేశంలో విజి లెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డి.ఎస్. చౌహాన్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రభుత్వ ధా న్యంపై నిర్వహించిన తనిఖీలు, దాడులు, నమోదుచేసిన క్రిమినల్ కేసులు, రికవరీలు, న్యాయపరమైన చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో భౌతిక తనిఖీలు, స్టాక్ల ధృవీకరణ, స్టాక్ రిజిస్టర్ల పరిశీలన, కొనుగోలు రికార్డులతో సరిపోల్చడం, ప్రభుత్వ ధాన్యం లేదా బియ్యం అక్రమ మళ్లింపులపై లోతైన విచారణ కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం, నమ్మకద్రోహం వంటి నే రాలకు ఆధారాలు లభించిన ప్రతి సందర్భంలో క్రిమినల్ కేసులు నమోదు చేయ డంతో పాటు, పదేపదే డిఫాల్ట్ చేస్తున్న మిల్లర్లపై బ్లాక్లిస్టింగ్ సహా కఠిన పరిపాలనా చర్యలు తీసుకుంటామని అధికారు లు తెలిపారు.






