వైభవంగా గౌండ్ల కులస్థుల బోనాలు
పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి/సదాశివపేట, ఆగస్టు 4 (విజయక్రాంతి) : సదాశివపేట, సంగారెడ్డి పట్టణాల్లో గౌడ కులస్థుల బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా సదాశివపేట పట్టణంలోని దుర్గమ్మ గుడిని సందర్శించిన నిర్మలా జగ్గారెడ్డి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గౌండ్ల కులస్థులు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సిడిసి చైర్మెన్ రామ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేణుక చిరు, కౌన్సిలర్ నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంగారెడ్డి పట్టణంలో జరిగిన గౌండ్ల కులస్థుల బోనాల వేడుకలకు ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు, గొర్రె పొట్టేళ్లతో అలంకరించిన ఫలహారం బండి ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ జోగిని నిషా క్రాంతి బోనం ఎత్తుకుని ఈ ఉత్సవంలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్, నరేందర్ చక్రవర్తి గౌడ్ , సురేందర్ గౌడ్, నక్క నాగరాజు గౌడ్, ఆర్. సుధాకర్ గౌడ్, దుర్గా గౌడ్, భరత్ గౌడ్, ఫని, కిరణ్, శ్రీకాంత్ , మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






