అరుంధతిలో పశుపతి హరీష్ క్షుద్రపూజలు నిజమే!
మార్చి 2న , జూన్ 2న తిరుచ్చికి.. మే 31, జూన్ 1, జూలై 23న శివమొగ్గకు..
ఎలాంటి దాపరికం లేదు ఆధారాలున్నాయి
బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి వారికి అఘోరాలతో తాంత్రిక పూజలు చేయడం అలవాటే
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి) : ‘బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారు.. ఇందులో ఎలాంటి దాపరికం లేదు.. తెలంగాణలో వర్షాలు పడొద్దని, పంట లు పండకూడదని ఆయన కుట్రలు చేస్తున్నారు. ఆయనకు స్వార్థం పరాకాష్ఠకు చేరింది. ఆయన అరుంధతి సినిమాలో పశుపతిలా మారాడు’ అని టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు.
మంగళవారం ఆయన గాంధీభవ న్‌లో టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణు గోపాల్, పార్టీ నేతలు శ్యామ్‌మోహన్, సామా రామ్మోహన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువుతో ప్రజలు అల్లాడిపోవాలని హరీష్ రావు కుతంత్రాలు చేస్తున్నారని, తమ పార్టీ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్‌రెడ్డిలకు నోటీసులు ఇవ్వడం అందు లో భాగమేనని అన్నారు.
హరీష్‌రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తమిళనాడు తిరుచిరాపల్లి , శివమొగ్గలో క్షుద్ర పూజలు చేసే దేవాలయాలు ఉన్నాయన్నారు. మార్చి 2న , జూన్ 2న తిరుచ్చి, మే 31, జూన్ 1 జులై 23 న హరీష్‌రావు శివమొగ్గ వెళ్ళారని, అందుకు సంబంధించిన తమ వద్ద ఆధారాలు ఉన్నాయని మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. తాము చెప్పిన తేదీ లలో హరీష్‌రావు ఎక్కడ ఉన్నారో మీడియాకి సమాధానం చెప్పాలని డిమాం డ్ చేశారు.
హరీష్‌రావు చేసిన క్షుద్రపూజలకు సంబంధించి వాస్తవాలు మాట్లాడిన కాంగ్రె స్ నాయకులకు నోటీసులు ఇచ్చారని ఆయ న తెలిపారు. ‘శివమొగ్గ వెళ్ళిన హరీష్‌రావు, ఫోటోలు సోషల్ మీడియా, ఫేస్ బుక్‌లో ఎందుకు పోస్ట్ చేయలేదు..? తిరుపతి వెళ్లినప్పుడు మీడియాతో మాట్లాడే హరీష్‌రావు ఈ దేవాలయాలకు వెళ్లినప్పుడు ఎందుకు మీడియాతో మాట్లాడలే దు?’ అని మహేష్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. అక్కడ ఏమి మొక్కుకున్నారు, ఏమి పూజలు చేశారో చెప్పలేదన్నారు.
రాష్ట్ర ప్రజలు బాగు కోసం పూజలు చేస్తే ఎందుకు బయటకు రాలేదన్నారు. ఆ రెండు ఆలయాలయాల్లో ఆయ న క్షుద్రపూజలు చేయడం ఎంత వరకు స మంజసం..? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ నాయకు లకు అఘోరా, తాంత్రిక పూజ లు చేయడం అలవాటుగా ఉందన్నా రు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో క్షుద్రపూజలు చేస్తున్నారని జరిగిన ప్రచారాన్ని మొదట్లో తను నమ్మలేదని, కానీ హరీష్‌రావు వైఖరి చూసి అనుమానాలు వస్తున్నాయన్నారు.
తెలంగాణ ఉద్యమం స మయంలో పెట్రోల్ పోసుకున్న హరీష్‌రావుకి అగ్గిపెట్ట దొరకలేదని ఆ యన ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ వైఖరి వల్లే ఆత్మహత్యలు జరిగాయన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ అధికారంలో ఇష్టారాజ్యంగా ప్రభు త్వం నడపారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో చేసిందేమీ లేదని అన్నారు. ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రతిపక్షంగా విమర్శలు చేయడం సహజమన్నారు. కరువు వస్తే ఎ లాంటి చర్యలు తీసుకోవాలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని.. కానీ బీఆర్‌ఎస్ ఆ పని చేయడం లేదన్నారు.






