5 August, 2026 | 2:41 AM

భవిత దివ్యాంగుల పాఠశాలలో ఫిజియోథెరపీ శిబిరం

05-08-2026 01:54 AM

రామారెడ్డి, ఆగస్టు 4 (విజయక్రాంతి): రామారెడ్డి మండలంలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో మంగళవారం ఫిజియోథెరపీ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన శారీరక వైకల్యం గల విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొని డాక్టర్ అక్షయ్ కుమార్ అందించిన వైద్య సేవలను పొందారు.

ఈ సందర్భంగా డాక్టర్ అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, శారీరక వైకల్యం ఉన్న విద్యార్థులకు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ, వ్యాయామ చికిత్స అందిస్తే వారి వైకల్యాన్ని కొంతవరకు తగ్గించడంతో పాటు సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యాభ్యాసం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.

ఇందుకు తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో కన్నాపూర్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్, సీఆర్పీ మెహమూద్, భవిత పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.