ఐసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం
05-08-2026 01:54 AM
నంగునూరు, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఎంబీఏ,ఎంసీఏ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్-2026 ధ్రువపత్రాల పరిశీలన రాజగోపాలపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ బూరం అభినవ్ తెలిపారు.
మూడు రోజులపాటు జరిగే ఈ ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమంలో భాగంగా, గత రెండు రోజుల్లో సుమారు 250 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరై తమ ధ్రువపత్రాలను పరిశీలించుకున్నారు. ఈ సందర్భంగా వారికి వెబ్ ఆప్షన్ల నమోదుపై అవగాహన కల్పించినట్లు ఆయన వెల్లడించారు. ఈ ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమంలో సయ్యద్ షాహెబాజ్,వి.రామకృష్ణ,రాజు, పాతూరి శ్రీనివాసరెడ్డి, జి.మధుబాబు, బి.విజయ్ కుమార్, పి.సంతోష్, పి.కిషోర్, మంజుల, వాణి తదితరులు పాల్గొన్నారు.






